నీతిమంతులైతే ఆస్తుల లెక్క చెప్పాలె.. కేసీఆర్ ఫ్యామిలీపై కడియం శ్రీహరి ఫైర్

నీతిమంతులైతే ఆస్తుల లెక్క చెప్పాలె.. కేసీఆర్ ఫ్యామిలీపై కడియం శ్రీహరి ఫైర్

జనగామ/హైదరాబాద్: కేసీఆర్ ఫ్యామిలీ నీతిమంతమైనదే అయితే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదన్నారు. కమీషన్లు వచ్చే పనులకే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నదని విమర్శించారు. వాళ్ల దోపిడీని దోచుకున్నందుకే తనను పక్కన పెట్టారని అన్నారు. 2014 కు ముందు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ ఆస్తులెంత ఉన్నాయి..? ఇప్పుడెంత ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మితే మోసపోతామని అన్నారు. 

‘బండి’ ఇదే పద్ధతి: కడియం

‘బండి సంజయ్‌కి అసలు జ్ఞానం అనేది ఉందా. నిజంగా గ్రూప్-1 అభ్యర్థులకు మంచి జరగాలని కోరుకుంటే సీఎం రేవంత్‎తో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సింది. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ అలా రోడ్లపై కూర్చోవడం పద్ధతేనా..’ అని కడియం ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ అంటే రవ్వంతైనా ప్రేమ లేదన్నారు. ఇవాళ  జనగామ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీ నీతిమంతమైనదే అయితే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. 

ALSO READ | అక్టోబర్ 24న హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్

బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదన్నారు. కమీషన్లు వచ్చే పనులకే వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నదని విమర్శించారు. వాళ్ల దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కన పెట్టారని అన్నారు. 2014కు ముందు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ ఆస్తులెంత ఉన్నాయి..? ఇప్పుడెంత ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మితే మోసపోతామని అన్నారు.