హనుమకొండ సిటీ, వెలుగు : దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోందని, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హనుమకొండలోని ఆ పార్టీ ఆఫీసులో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దేశంలోని 25 శాతం మంది వద్దే అత్యధిక సంపద ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కేయూ రిటైర్ట్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, టీజేఎస్ నాయకులు రాజేంద్రప్రసాద్, అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోదండరాంను కలిసిన కడియం శ్రీహరి
హనుమకొండలోని టీజేఎస్ ఆఫీస్‌కు వచ్చిన కోదండరాంను స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి కలిశారు. వరంగల్ పార్లమెంట్ క్యాండిడేట్‌గా కడియం కావ్య విజయానికి సహకరించాలని కోరారు.