బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టట్లే : కడియం శ్రీహరి

  • బిల్లును సుప్రీం కోర్టు ద్వారా  సాధించుకోబోతున్నం

వరంగల్‍, వెలుగు : బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గడిచిన పదేండ్లలో ఎస్సీ వర్గీకరణపై బిల్లు ఎందుకు పెట్టలేదో చెప్పాలని స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. సోమవారం హనుమకొండ హంటర్​రోడ్​లోని అభిరామ్‍ గార్డెన్‍లో స్టేషన్‍ ఘన్‍పూర్‍ మాదిగ, మాదిగ ఉప కులాల ఆత్మీయ సమ్మేళనంలో కడియం పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎవ్వరు ఉద్యమం చేసినా సహకరించానని, తాను వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణను సాధించుకోబోతున్నట్లు ప్రకటించారు. 

రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ చూస్తోందని, ఆ పార్టీ గెలిస్తే రాబోయే రోజుల్లో దళితుల భవిష్యత్‍ అగమ్యగోచరంగా మారుతుందన్నారు. మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్‍ అధ్యక్షుడిగా కాకుండా ఆర్‍ఎస్‍ఎస్‍ కార్యకర్తలా మారాడని విమర్శించారు. అతడు దళిత జాతికి ద్రోహం చేస్తున్నాడన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో కడియం కావ్యను గెలిపించాలని కోరారు. మేడి పాపయ్య, కనకరాజ్‍, ఇటుక రాజ్‍  పాల్గొన్నారు.