వరంగల్ నుంచి నన్ను మాత్రమే ఆహ్వానించారు

టీఆర్ఎస్ లో  కష్టపడే వారికి ఖచ్చితంగా గౌరవం ఉంటుందన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఈ మధ్య కేసీఆర్ తనని గుర్తించడం లేదని... కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. దళితబంధు రివ్యూకు వరంగల్ నుంచి తనని మాత్రమే ఆహ్వానించారని చెప్పారు. పనిచేసే వాళ్లెవరో.. పైసలు తీసుకునే వారెవరో ప్రజలకు, పార్టీ అధినేతకు తెలుసన్నారు. విభేదాలు లేకుండా పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు కడియం.