రఘునాథపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధియే తన ఎజెండా అని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం, రాయరాయిని బంగ్లా, మేకలగట్టు, అశ్వారావుల్లి, వెల్ది గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
Also Read : కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి: వెడ్మ బొజ్జుపటేల్
ఆరు కాదు ఆరువందల గ్యారెంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యుడు రాంబాబు, సర్పంచుల ఫోరం జనగామ జిల్లా అధ్యక్షుడు పోగుల శివకుమార్, జడ్పీటీసీల జిల్లా ఫోరం అధ్యక్షుడు బొల్లం అజయ్, మండల పార్టీ అధ్యక్షుడు వారాల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నామాల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.