ధర్మసాగర్, వెలుగు : నారాయణగిరి లో మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కి కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మసాగర్ మండలంలో ఒక్క నారాయణగిరి గ్రామంలోనే సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ను నిర్వహించడం శుభసూచకమని అన్నారు.
వచ్చే జాతర వరకు సీసీ రోడ్డు, విద్యుత్ లైట్లు, ఆలయ ప్రాంగణం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ వల్లపురెడ్డి రమాదేవి, జాతర నిర్వాహకులు అప్పని భాస్కర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ , తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, నాయకులు పేసరు రమేశ్, నర్సింహారెడ్డి, నాగరాజు, కడారి రమేశ్, మధుకర్, పుట్ట కుమార్ పాల్గొన్నారు.