సైనిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ తరలిస్తే సహించేది లేదు : కడియం శ్రీహరి

  •     స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : ధర్మసాగర్‌‌‌‌ మండలం ఎలకుర్తిలో ఏర్పాటు చేయాలనుకున్న సైనిక్‌‌‌‌స్కూల్‌‌‌‌ను సికింద్రాబాద్‌‌‌‌కు తరలిస్తే సహించేది లేదని స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎలకుర్తిలో సైనిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఏర్పాటు కోసం 2017లో 49 ఎకరాల భూమి సేకరించామని గుర్తుచేశారు.

ప్రస్తుతం సైనిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ను తరలించాలని విద్యాశాఖ కమిషనర్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాయడం సరికాదన్నారు. మంత్రులకు వరంగల్‌‌‌‌ జిల్లాపై ప్రేమ ఉంటే సైనిక్‌‌‌‌ స్కూల్‌‌‌‌ను ఎలకుర్తిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అభివృద్ధి పనులకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 285 కోట్లను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అనేక మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

సర్పంచ్‌‌‌‌ల పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైస్‌‌‌‌ మిల్లర్స్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ జిల్లా ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు రాపోలు మధుసూదన్‌‌‌‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గన్ను నర్సింహులు, ఎంపీటీసీ రజాక్‌‌‌‌ యాదవ్‌‌‌‌, నాయకులు బూర్ల శంకర్, తోట సత్యం, నీల గట్టయ్య పాల్గొన్నారు.