ఆటల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్‌‌‌‌ : కడియం శ్రీహరి

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు : ఆటల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్‌‌‌‌ ఉంటుందని స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. కడియం ఫౌండేషన్‌‌‌‌ సహకారంతో జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ మండలం చాగల్లులో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు కడియం ఫౌండేషన్‌‌‌‌ కృషి చేస్తోందన్నారు.

యువకులు చదవుతో పాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం ఆటగాళ్లకు ఉప సర్పంచ్‌‌‌‌ పొన్న రజిత రాజేశ్‌‌‌‌ టీషర్ట్స్‌‌‌‌ అందజేశారు. కబడ్డీ అసోసియేషన్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌‌‌‌ పొట్లపల్లి శ్రీధర్‌‌‌‌రావు, రైస్‌‌‌‌ మిల్లర్స్​వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్​రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న, నాయకులు రాపోలు మధుసూదన్​రెడ్డి, కనకం రమేశ్‌‌‌‌ పాల్గొన్నారు.

పాలకుర్తిలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

పాలకుర్తి, వెలుగు : యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తి జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో శుక్రవారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సీఐ విశ్వేశ్వర్‌‌‌‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌ వీరమనేని యాకాంతారావు, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మహాత్మా హెల్పింగ్‌‌‌‌ హ్యాండ్స్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌ గంట రవీందర్‌‌‌‌, ఎస్సై తాళ్ల శ్రీకాంత్‌‌‌‌ పాల్గొన్నారు.