అవినీతిని ఖడ్గంతో అంతమొందిస్తా: కడియం శ్రీహరి

అవినీతిని ఖడ్గంతో అంతమొందిస్తా: కడియం శ్రీహరి

ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి పనులు చేయాలే తప్పా.. అవినీతితో డబ్బులు దండుకోవడం ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో అవినీతిని ఖడ్గంతో అంతమొందిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను మంత్రిగా ఉన్నప్పుడు ధర్మసాగర్, జాఫర్ ఘడ్, స్టేషన్ ఘనపూర్ లోని తండాలకు రోడ్డు వేయించానని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇప్పటికీ అనేక తండాలలో రోడ్లు లేకపోతే, 11 కోట్లతో రోడ్లకు మంజూరు ఇప్పించానన్నారు. గ్రామపంచాయతీగా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.