చిల్పూర్‌‌‌‌‌‌‌‌గుట్టను టూరిజం సెంటర్‌‌‌‌‌‌‌‌గా మారుస్తా : కడియం శ్రీహరి

స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ (చిల్పూరు), వెలుగు : జనగామ జిల్లా చిల్పూరు గుట్టను టూరిజం సెంటర్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. చిల్పూరు బుగులు వేంకటేశ్వరస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పొట్లపల్లి శ్రీధర్‌‌‌‌‌‌‌‌రావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు రంగాచార్యులు, రవీందర్‌‌‌‌‌‌‌‌శర్మ, కృష్ణమాచార్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం చేపట్టిన పనుల టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వ నిధులే కాకుండా భక్తుల ద్వారా విరాళాలు సేకరించి అభివృద్ధి పనులు జరిపిస్తామన్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఉద్దెమారి రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎంపీపీ సరిత, వైస్‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ సరిత, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, డిస్ట్రిక్ట్​లైబ్రరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, నాయకులు చింతకుంట్ల నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.