వరంగల్: కడియం శ్రీహరి కులంపై ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సమయంలో అభ్యంతరాలు చెబుతున్నారు.. ఆయన 40 యేళ్లుగా అదే సర్టిఫికెట్ తో ప్రజాప్రజాతి నిధిగా ఉన్నారు..అప్పుడు లేని ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. కులంపై ఎలాంటి విచారణకైనా సిద్దమన్నారు. ఎటువంటి కమిషన్ విచారణకు అయిన రెడీ అన్నారు. దళిత మహిళగా, వైద్యురాలిగా, సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు కడియం కావ్య.
వచ్చే ఐదేళ్లలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాన్నారు కడియం కావ్య. హైదరాబాద్,వరంగల్, భూపాలపల్లి నేషనల్ హైవేను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించి సబ్సిడీల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాజీపేట జంక్షన్ ను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు కృషి చేస్తానన్నారు కడియం కావ్య. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెచ్చేలా ప్రత్యేక దృష్టి పెడతానన్నారు.