కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి : యశస్వినిరెడ్డి

  • గ్రామాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత ప్రచారం

పాలకుర్తి, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​   క్యాండిడేట్​ కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించి పాలకుర్తి నియోజక వర్గ సత్తా చాటాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని చెన్నూరు, మైలారం, దర్దపల్లి, వావిలాల, కొండాపురం, ఈరవెన్ను గ్రామాల్లో   ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నియంత, దోపిడి పాలన నుంచి  పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విముక్తి పొందారని అన్నారు. కార్యక్రమంలో  బ్లాక్​ కాంగ్రెస అధ్యక్షుడు  రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్​  పాల్గొన్నారు. 

కావ్యను గెలిపించాలి :  ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ వెంకటనారాయణ

ప్రజలు బీజేపీని ఓడించి, కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ   పిలుపునిచ్చారు.  పాలకుర్తి మండల కేంద్రంలో  గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.   పన్నులతో నిత్యవసర సరుకులపై ధరలు పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు.  2023 అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని

పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో మార్పు కోసం  కాంగ్రెస్​ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంఘని మల్లేశ్వర్,  బీసీ  న్యాయవాదుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రాచకొండ ప్రవీణ్ కుమార్, జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మంద వీరస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ   పాల్గొన్నారు.