కేసీఆర్ పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

వరంగల్: కేసీఆర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యాలు చేశారు.  తెలంగాణ  వనరులను కేసీఆర్ కుటుంబం  దోచుకుందన్నారు.  భూ కబ్జా కేసులు, ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఫ్యామిలీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతికి కారణం కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణకు అసలు మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు.

కాకతీయ వారసులుగా చెప్పుకునే అవకాశం లేకుండా వరంగల్ ను  కేసీఆర్.. 6 ముక్కలు చేశాడన్నారు కడియం. రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరగబోతోందని.. బీఆర్ఎస్ ఇక రాష్ట్రం లో మూత పడబోతోందని అన్నారు.  ఒక్క పార్లమెంట్ స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవదని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నే పోటీ ఉంటుందన్నారు.

Also Read:కేసీఆర్.. పొద్దుగాల చెప్పిన మాటలు.. రాత్రికి మర్చిపోతారు

వ్యక్తిగత విమర్శలు మానుకుని పార్టీనీ కాపాడుకోవడాని కేసీఆర్ ప్రయత్నం  చేయాలని సూచించారు. ఎవ్వరికీ పరిచయం లేని... సంబంధం లేని వ్యక్తినీ నిలబెట్టి వరంగల్ లో బీజేపీని పరోక్షంగా గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. తనను తిట్టడానికే రాజయ్య ను జీతానికి పెట్టుకున్నారని విమర్శించారు. వరంగల్ పై కేసీఆర్ కు ఒక రకమైన కోపం ఉందని.. ప్రశ్నించే వ్యక్తులు ఇక్కడ ఎక్కువ కాబట్టే.. వరంగల్ ను ముక్కలు చేశారన్నారని చెప్పారు. బయటకు కనిపించేది వేరు...కేసీఆర్ లోపల అసలు నిజ స్వరూపం వేరని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబానికి హైదారాబాద్ చుట్టూ వేల ఎకరాలు ఎలా వచ్చాయని కడియం శ్రీహరి ప్రశ్నించారు.