కాగజ్​నగర్ ఫారెస్ట్​లో అడవి కుక్కలు

కాగజ్​నగర్ ఫారెస్ట్​లో అడవి కుక్కలు

ఆసిఫాబాద్, వెలుగు: అరుదైన పక్షులకు, జంతువులకు నిలయమైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ అడవుల్లో  వైల్డ్ డాగ్స్ కెమెరాలకు చిక్కాయి. పులులను సైతం భయపెట్టేంత ధైర్యం ఈ అడవి కుక్కలకు ఉంటుంది. అంతరించిపోతున్న అడవి జంతువుల జాబితాలో ఉన్న ఇండియన్‌‌‌‌ వైల్డ్‌‌ డాగ్స్‌‌ ఇప్పుడు  కాగజ్ నగర్, పెంచికల్‌‌ పేట్‌‌ అడవుల్లో కనిపించాయి. బార్కింగ్ డీర్ (మొరిగే జింక)ను కూడా అటవీ శాఖ గుర్తించింది.

 ఇవి మహారాష్ట్ర , చత్తీస్​ఘడ్ అడవుల్లో నుంచి వలస వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అపదను గుర్తించి ఓ రకమైన అరుపు చేయడం బార్కింగ్ డీర్ ప్రత్యేకత. వైల్డ్ డాగ్స్,  బార్కింగ్ డీర్ కనిపించడంతో ఇప్పటికే 280 కి పైగా పక్షి జాతులు సంచరించే కాగజ్ నగర్ అడవికి మరింత ప్రత్యేకత చేకూరింది.