కాగజ్ నగర్ ఆర్డీవో ఆఫీస్ చరాస్తుల జప్తు వాయిదా

కాగజ్ నగర్  ఆర్డీవో ఆఫీస్ చరాస్తుల జప్తు వాయిదా

ఆర్డీవో లిఖిత పూర్వక హామీతో రెండు నెలల టైమ్

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ ఆర్డీవోఆఫీస్ చరాస్తుల జప్తు రెండు నెలలు వాయిదా పడింది. డివిజన్లోని దహెగాం మండలం పీపీ రావు ప్రాజెక్ట్ కోసం పత్తినిలో జరిపిన భూ సేకరణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయని కాగజ్ నగర్ ఆర్జీవో ఆఫీస్చరా స్తులు జప్తు చేయాలని ఇటీవల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం కోర్టు అధికారులు, సిబ్బంది ఆర్డీవో ఆఫీస్ కు వచ్చారు. చరాస్తులను సీజ్ చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఆర్డీవో సురేశ్ బాబు కోర్టు అధికారుల బృందంతో చర్చలు జరిపారు. 5.33 కోట్ల పరిహారం ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి ఇస్తానని, రెండు నెలల సమయం కావాలని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పును తాత్కాలికంగా వాయిదా వేశారు. పరిహారం రైతులకు అందడం ము ఖ్యమని అందుకే చరాస్తుల సీజ్ చేయకుండా గడువు ఇస్తున్నామని కోర్టు నుంచి వచ్చిన అధికారులు చెప్పారు.

ఇదీ వ్యవహారం..

కాగజ్ నగర్ డివిజన్లోని పీపీ రావు ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కోసం హై కోర్టులో గతంలో కేసు వేశారు. దీంతో ఒక్కో ఎకరాకు రూ. లక్ష చొప్పున 132 ఎకరా లకు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశిం చింది. అయితే ఈ పరిహారంపై లాయర్లు విక్రమ్ రెడ్డి, శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. స్పం దించిన కోర్ట్ రూ. 5 కోట్ల 33 లక్షల పరిహారం చెల్లించాలని కాగజ్ నగర్ ఆర్జీవోను గతేడాది జూలై 27న ఆదేశించింది.

ALSO Read :  అసభ్య పదజాలం వాడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త : విశ్వప్రసాద్ రావు

ఈ పరిహారం చెల్లింపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులను ఇప్పటివరకు. అమలు చేయకపోవడంతో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. తీర్పు అమలు చేయకుండా ధిక్కరించిన కాగజ్ నగర్ ఆర్జీవో ఆఫీస్ చరాస్తు లు, వాహనం జప్తు చేయాలని జడ్జి యువరాజ గతనెల 27న ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం కోర్టు అధికారులు చరాస్తులు జపు చేసేందుకు వెళ్లారు.