కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లోని నాటు సారా స్థావరాలపై గురువారం కాగజ్ నగర్ ఎక్సైజ్ అధికారులు అకస్మిక దాడులు చేసి 60 లీటర్ల గుడుంబా పట్టుకున్నారు. గురువారం ఉదయం అకస్మిక దాడులు నిర్వహించి గుడుంబాతో పాటు 4 వేల లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీలో వాడే 30 కిలోల బెల్లం,10 కిలోల పటిక పట్టుకున్నామని సీఐ తెలిపారు.
4 వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామన్నారు. 6 కేసులు నమోదు చేసి గుడుంబా తయారుచేస్తున్న 8 మందిని చింతలమానేపల్లి తహసీల్దార్ మునావర్ షరీఫ్ ముందు బైండోవర్ చేసి నట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు పి.లోభానంద్, ఐ.సురేశ్, పి.రాజేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.