ఆసిఫాబాద్​ జిల్లాలో 13 పశువుల వాహనాల పట్టివేత

ఆసిఫాబాద్​ జిల్లాలో 13  పశువుల వాహనాల పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్ నుంచి హైదరాబాద్‌‌‌‌కు 13 బొలెరో వాహనాల్లో 26 ఎద్దులను తరలిస్తుండగా కాగజ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. 13 మందిపై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. సోమవారం సరైన పత్రాలు లేకుండా ఎద్దులను తరలిస్తున్నారనే సమాచారం అందడంతో  పోలీసులు వెళ్లి వాహనాలను ఆపారు. వాటికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్, తాగునీరు, గడ్డి వంటి వసతులు లేవు. దీంతో ఎద్దులను స్వాధీనం చేసుకుని త్రిశూల్ పహాడ్ గోశాలకు తరలించారు.

  ఎండీ సిరాజ్, మహమ్మద్ రియాజ్, ఎండీ సాజిద్, పైదిపాల రవి, గుంటకుల మహేందర్, చింతకొండి స్వామి, గుంట కుల రమేశ్, మటేటి మహేందర్, మటేటి రాము, ఉప్పడ నర్సయ్య, అవునూరి తిరుపతి, నూనవత్ సంతోష్, ఇస్లావత్ జితేందర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పశువులను  రవాణా చేసే ముందు, వెటర్నరీ డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్, తాగునీరు, గడ్డి వంటి సదుపాయాలు తప్పనిసరి అని, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.