కాగజ్ నగర్ ​లో తైబజార్ టెండర్ రద్దు చేయాలని మార్కెట్ బంద్

కాగజ్ నగర్ ​లో తైబజార్ టెండర్ రద్దు చేయాలని మార్కెట్ బంద్
  • ఒక్కో బుట్టకు రూ.30 వసూలు చేస్తున్నారని ధ్వజం

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ టౌన్​లోని ఇందిరా మార్కెట్​లో కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు వద్ద రుసుం పేరిట వసూళ్లను ఆపాలని, వెంటనే తై బజార్ రద్దు చేయాలని చిరు వ్యాపారులు రోడ్డెక్కారు. తైబజార్​లో చేపట్టే చిట్టీ వసూళ్లకు నిరసనగా బుధవారం కూరగాయల మార్కెట్ బంద్ పాటించారు. కూరగాయల మార్కెట్ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ అఫీస్​కు ర్యాలీగా చేరుకున్నారు.

వారికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప,  మున్సిపల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్​చార్జి లెండుగురె శ్యామ్ రావు మద్దతు పలికారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. పల్లెల్లో కష్టపడి కూరగాయలు పండించి అమ్మేందుకు వచ్చిన వాళ్ల దగ్గర మార్కెట్ వేలంపాటలో దక్కించుకున్నవారు బుట్టకు రూ.30 వసూలు చేయడం దారుణమన్నారు. మార్కెట్​లో వసూళ్లు ఆపాలని డిమాండ్​ చేశారు