మీర్పూర్: పేసర్ కగిసో రబాడ (6/39) బౌలింగ్‌లో చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. పదేళ్ల తర్వాత ఆసియాలో సఫారీలకు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. బంగ్లా నిర్దేశించిన 106 రన్స్ లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టోనీ డి జోర్జి (41), ట్రిస్టాన్ స్టబ్స్ (30), మార్‌క్రమ్ (20) రాణించారు. తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 283/7 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 89.5 ఓవర్లలో 307 రన్స్‌కు ఆలౌటైంది. మెహిదీ హసన్ మిరాజ్ (97) సెంచరీ మిస్ చేసుకోగా, జాకిర్ అలీ (58) మెరుగ్గా ఆడాడు. నయీమ్ హసన్ (16), తైజుల్ ఇస్లామ్ (7), హసన్ మహ్ముద్ (4 నాటౌట్) ఫెయిలయ్యారు. కేశవ్ మహారాజ్ 3 వికెట్లు తీశాడు. కైల్ వెరెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ మంగళవారం నుంచి చిట్టగాంగ్‌లో జరుగుతుంది.