కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర

కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర

కాసేపట్లో కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలింగనర్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కైకాల అంతిమయాత్ర కొనసాగనుంది. మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

కైకాల మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. నటులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి తరలివచ్చి కైకాల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఉదయం జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్ కైకాల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తెలుగు పరిశ్రమలో పెద్దవాళ్లను కోల్పోవడం వర్ణించలేని బాధ అని చెప్పారు. కైకాల మరణం తీరనిలోటని అన్నారు.