ఎంపీలను కలిసిన కైలాస్ నేత

మునుగోడు, వెలుగు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పూర్ణ కైలాస్ నేత శుక్రవారం నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేయాలని కోరారు.