మోడీజీ.. ఆడబిడ్డలను కాపాడుకుందాం
ప్రధానికి నోబెల్ గ్రహీత కైలాస్ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలని, రేప్లపై యుద్ధానికి మీరు నాయకత్వం వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి శనివారం లేఖ రాశారు. యూపీలో జరిగిన దారుణమైన ఘటన తర్వాత దేశం మొత్తం మీవైపే చూస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితికి త్వరగా ముగింపు పలకాలని కోరారు. మేమంతా మీ వెంట ఉంటామని, ఇలాంటి అవమానకర ఘటనలపై వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు. అత్యాచార సంస్కృతిని అంతం చేయడానికి ప్రజలకు పొలిటికల్ సపోర్ట్ కూడా అవసరమన్నారు. ఏళ్లుగా ఆడ బిడ్డలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు ఇలా మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించారు.
For More News..