అంగన్​వాడీ టీచర్ల డిమాండ్లను నెరవేర్చాలే: సుధారాణి

మోర్తాడ్, వెలుగు: అంగన్​వాడీ టీచర్ల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని జిల్లా అంగన్​వా టీచర్ల అధ్యక్షురాలు కైరీ దేవాగంగు కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం సీడీపీవో  సుధారాణి కి డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని 70 వేల మంది అంగన్​వాడీ టీచర్లకు  ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

ALSO READ: ఇంటింటికీ నీళ్లిస్తామని.. వీధివీధికి లిక్కర్‌‌‌‌షాపులిచ్చిన్రు

రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం టెన్త్​అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ లీడర్లు రమేశ్, టీచర్లు జ్యోతి, చంద్రకళ  పాల్గొన్నారు.