
కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్‌గా సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలకపాత్ర పోషించాడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. జూన్ 7న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాజల్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో కొత్త ప్రయత్నం చేశా. కథ కొత్తగా ఉండడంతో పాటు ఇలాంటి పాత్ర పోషించడం ఇదే తొలిసారి.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉందనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీగా ఫీలవుతా. ఇందులో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ యాక్షన్, భారీ స్టంట్స్ చేశా. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు. కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందనుకుంటున్నా’ అని చెప్పింది. ‘ఇది లోకల్ కథ. మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుంది’ అని మూవీ ప్రెజెంటర్ శశికిరణ్ తిక్క అన్నాడు. ‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.