
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama). కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల(Suman Chikkala) తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ టిక్కా నిర్మించారు. క్రైం అండ్ ఇన్వెస్టిగేటీవ్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(జూన్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చాలా గ్యాప్ తరువాత వచ్చిన కాజల్ ఏమేరకు ఆకట్టుకున్నారు? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సత్యభామ(కాజల్)షీ టీమ్ ఏసీపీ. అమ్మాయిలను ఇబ్బందిపెట్టేవారిని పట్టుకొని వారికి శిక్ష పడేలా చేస్తుంది. అలా తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా సత్యభామ ఉందనే నమ్మకం కలిగిస్తుంది. అలా ఒకరోజు హసీనా అనే యువతి తన భర్త హింసిస్తున్నాడు అని సత్యకు చెబుతుంది. దాంతో సత్య హసీనా భర్తకు వార్నింగ్ ఇస్తుంది. ఆ కోపంతో ఆ వ్యక్తి హసీనాను చంపేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి సత్య రంగంలోకి దిగుతుంది. అదే సమయంలో హసీనా తమ్ముడు మిస్ అవుతాడు. దాంతో ఆ హసీనా కేసును పర్సనల్‌గా తీసుకుంటుంది సత్య. ఆ కేసులో సత్యకు ఎదురైనా ఇబ్బందులు ఏంటి? హసీనా హత్యకి కారణం ఏంటి? తన తమ్ముడిని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్య ఆడియన్స్ క్రైం థ్రిల్లర్ జానర్ సినిమాలను ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ఆ జానర్ లో వచ్చిన మరో సినిమానే సత్యభామ. కానీ, ఈ సినిమా కాస్త ప్రత్యేకం. మాములుగా థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరో తెలియడమే మెయిన్ పాయింట్ గా ఉంటుంది. కానీ, సత్యభామ సినిమాలో విలన్ ఎవరో ముందే తెలుస్తుంది అతన్ని పట్టుకోవడానికి మెయిన్ లీడ్ చేసే ప్రయత్నమే ఈ సినిమా. అయితే.. రొటీన్ స్టోరీ ఆడియన్స్ కు కాస్త బోర్ కొట్టిస్తుంది.
కాజల్ ఇంట్రో సీన్స్, ఆమె పర్సనల్ లైఫ్ తో మొదలైన సినిమా రొటీన్ గా సాగుతింది. ఆ తరువాత హసీనా హత్యతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుండి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అక్కడి నుండి సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. మధ్యలో వచ్చే ఉప కథలు కాస్త డిస్టర్బ్ చేసినా క్లిమాక్స్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది.
నటీనటులు, సాంకేతికనిపుణులు:
ఈ సినిమాకు ప్రధాన బలం అంటే కాజల్ అనే చెప్పాలి. ఒక రొటీన్ కథని తన పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకుళ్లింది. సత్య పాత్రలో ఒదిగిపోయింది. ఇక యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది. ఇప్పటివరకు కాజల్ ను గ్లామర్ రోల్ చూసిన ఆడియన్స్ కు సత్య పాత్ర చాలా కొత్తదనాన్ని ఇస్తుంది. ఇక నవీన్ చంద్ర కూడా తన పాత్ర మేర ఆకట్టుకున్నాడు. ప్రజ్వల్ యాద్మ, ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు చిన్నవే అయినా గుర్తుండిపోతాయి.
సాంకేతికనిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం. పాటలు ఆకట్టుకోకపోయినా తన బీజీఎమ్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు శ్రీచరణ్. ననిజానికి క్రైం థ్రిల్లర్ సినిమాలకు నేపధ్య సంగీతం చాలా ముఖ్యం. ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యారు శ్రీచరణ్. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఇక మొత్తంగా సత్యభామ సినిమా గురించి చెప్పాలంటే.. సత్య పాత్రలో కాజల్ కనిపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది.