ఐ యామ్‌‌ బ్యాక్‌‌ .. సికందర్‌‌‌‌ మూవీతో వస్తున్నా కాజల్ ఆగర్వాల్

ఐ యామ్‌‌ బ్యాక్‌‌ .. సికందర్‌‌‌‌ మూవీతో వస్తున్నా కాజల్ ఆగర్వాల్

ఒకప్పుడు పెళ్లి తర్వాత హీరోయిన్స్‌‌కు అవకాశాలు తగ్గేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్‌‌ పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. పైగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్‌‌ సినిమాలో నటించిన కాజల్.. త్వరలో రాబోతున్న ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీదేవిగా కనిపించబోతోంది. మరోవైపు కొంత బ్రేక్‌‌ తర్వాత ఆమె హిందీలో నటించిన  ‘సికందర్‌‌‌‌’ చిత్రం ఈ నెల 30న విడుదల అవుతోంది.  

సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలకపాత్రను పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌‌‌‌లో ఆమె క్యారెక్టర్‌‌‌‌ ఇంపార్టెన్స్‌‌ను చూపించారు. ఇందులో చీరకట్టులో ట్రెడిషనల్‌‌గా కనిపించిన కాజల్..  ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్‌‌లో మాత్రం మోడ్రన్‌‌ కాస్ట్యూమ్స్‌‌లో మెరిసింది. తాజాగా ఈ ఈవెంట్‌‌కు సంబంధించిన తన ఫొటోస్‌‌ను ఆమె సోషల్‌‌ మీడియాలో షేర్ చేసింది. స్లిమ్ ఫిట్ సిల్వర్‌‌‌‌ కలర్‌‌‌‌ టాప్, బ్లాక్‌‌ మ్యాక్సీ స్కర్ట్‌‌తో మరింత యంగ్‌‌ అండ్‌‌ గ్లామర్​గా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేసింది. కాజల్ ఈజ్‌‌ బ్యాక్‌‌ అంటూ ఈ ఫొటోస్‌‌ను అభిమానులు వైరల్‌‌ చేస్తున్నారు.