పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ .. కన్నప్ప మూవీ నుంచి పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ .. కన్నప్ప మూవీ నుంచి పస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’.  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, ప్రీతి ముకుందన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ ను రివీల్ చేశారు. 

సోమవారం కాజల్ అగర్వాల్ పాత్రను పరిచయం చేశారు.  ఇందులో ఆమె పార్వతీ దేవిగా నటిస్తోంది. తన డ్రీమ్ రోల్ ఇదని,  ఎంతో ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది.  ప్రభాస్,  అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 25న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.