కాజల్ ఒక ఫైర్ బ్రాండ్ : బాలకృష్ణ

కాజల్ ఒక ఫైర్ బ్రాండ్  :  బాలకృష్ణ

కాజల్‌‌‌‌ అగర్వాల్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో సుమన్ చిక్కాల తెరకెక్కించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలకపాత్ర పోషిస్తున్నాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. శుక్రవారం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. ఆ పేరు ఉమెన్ ఎంపవర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌కు ప్రతీక. ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. 

హీరోయిన్‌‌‌‌కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. దాన్ని బ్రేక్ చేసింది కాజల్. ‘భగవంత్ కేసరి’లో మేము కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్స్​పీరియన్స్’ అన్నారు. కాజల్ మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే చాలా ఎమోషనల్‌‌‌‌గా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. గ్లింప్స్ చూశాక ఆ నమ్మకం రెట్టింపు అయ్యింది. టాలెంటెడ్ టీమ్ మా మూవీకి పనిచేశారు. నన్ను స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ను చేసి లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు కూడా అదే ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పింది. 

అప్పట్లో విజయశాంతి గారిలా ఇప్పుడు కాజల్‌‌‌‌కు పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యిందని అనిల్ రావిపూడి అన్నాడు. కాజల్ యాక్షన్ సీన్స్‌‌‌‌తో ఆకట్టుకుంటుందని నవీన్ చంద్ర అన్నాడు. ‘ఇదొక ఎమోషనల్ పవర్ ప్యాక్డ్ మూవీ. మంచి ఎమోషన్ కూడా ఉంది’ అని శశికిరణ్ తిక్క చెప్పాడు. దర్శకనిర్మాతలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, ఎడిటర్ పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.