
సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal agarwal) నటించిన తమిళ హారర్ మూవీ కరుంగాపియమ్(Karungapiyam)తెలుగులో కాజల్ కార్తీక. దర్శకుడు డీకే(Dk) తెరకెక్కించిన ఈ సినిమాలో..రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో కనిపించారు. గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అందుకే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చి ఏడాది గడుస్తున్నా..ఓటీటీలో మాత్రం రిలీజ్ అవలేదు. ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా వారు దక్కించుకున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్గా ఈ సినిమా ఏప్రిల్ 9న ‘కాజల్ కార్తీక’హనుమాన్ మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.హారర్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.ఐదు కథలతో ఆంథాలజీగా తెరకెక్కిన ఈ సినిమా అలరిస్తుంది అంటూ మేకర్స్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు.మరి థియేటర్స్లో డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
కథ విషయానికి వస్తే..
కథలో భాగంగా నడిచే ఐదు కథలు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచుతాయి. చూస్తూ ఉన్న ప్రతి కథ ఏదో జరగబోతుందనే ఫీలింగ్ ఇస్తుంది.
శృతి ఓ సింగర్. ఓ సినిమా పాట పాడటం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్థ్ అభిమన్యు స్టూడియోకు వస్తుంది. ఆ స్టూడియోలో శృతికి వింత మనషులు కనిపిస్తారు. సిద్ధార్థ్ అభిమన్యు అప్పటికే చనిపోయాడనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది నాలుగో కథ.
కార్తిక (కాజల్ అగర్వాల్)భర్త ఆర్మీలో పనిచేస్తుంటాడు. కూతురు ఉమాయిల్ తో కలిసి పల్లెటూరిలో ఉంటుంది. ఆ ఊరిలో వరుసగా చిన్నపిల్లలు మాయమవుతుంటారు. దాంతోపాటు కొందరు పెద్దలు హత్యకు గురవుతుంటారు.మరి ఆ మర్డర్స్‌కు కార్తికనే కారణమని నింద మోపి హత్య చేస్తారు? ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఐదో కథ. ఈ ఐదు కథలను కలుపుతూ మరో స్టోరీగా రెజీనా ట్రాక్ నడుస్తుంది.