
హైదరాబాద్, వెలుగు: సిరామిక్, విట్రిఫైడ్ టైల్స్కంపెనీ కజారియా హైదరాబాద్‌లో అతిపెద్ద ఎటర్నిటీ, కెరోవిట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. కజారియా సీనియర్ఎగ్జిక్యూటివ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము తయారు చేసే టైల్, బాత్, శానిటరీ వేర్ కలెక్షన్ను ప్రతి కుటుంబానికీ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన ఈ మెగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నానాటికీ విస్తరిస్తున్న తమ నెట్‌వర్క్ కు మరో మైలురాయని అన్నారు.
ఈ సెంటర్‌ను 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 1 జీవీటీ బ్రాండ్, ప్రీమియం కెరోవిట్ బాత్‌వేర్ ఉత్పత్తులను ఇక్కడ కొనొచ్చు. అల్టిమా రేంజ్ లార్జ్ ఫార్మాట్ విట్రిఫైడ్ శ్లాబ్‌లు, క్రోమ్ ఫినిష్డ్ కుళాయిలు, బేసిన్లు, బాత్రూం ఫిట్టింగ్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయి.