Competitive Exams Material: కాజిండ్​ 2024 విన్యాసాలు

Competitive Exams Material: కాజిండ్​ 2024 విన్యాసాలు

భారత్​, కజకిస్తాన్​ సంయుక్త మిలిటరీ విన్యాసాలు కాజిండ్​ 2024 ఎనిమిదో ఎడిషన్​ ఉత్తరాఖండ్​ రాష్ట్రం ఔలిలోని సూర్య ఫారిన్​ ట్రైనింగ్​ నోడ్​లో ప్రారంభమయ్యాయి. కాజిండ్​ సంయుక్త సైనిక విన్యాసాలను ఇరు దేశాలు 2016 నుంచి నిర్వహిస్తున్నాయి. గత ఏడాది ఏడో ఎడిషన్ విన్యాసాలు కజకిస్తాన్​లోని ఓటార్​లో జరిగాయి. కాజిండ్​ 2024 సైనిక విన్యాసాల ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంతోపాటు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

క్రూజ్​ భారత్​ మిషన్​ 

దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు క్రూట్​ భారత్​ మిషన్​ కార్యక్రమాన్ని కేంద్ర షిప్పింగ్​ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఈ మిషన్​లో భాగంగా 100 సముద్ర క్రూట్​ టెర్మినల్స్, 100 రివర్​ క్రూజ్​ టెర్నినల్స్​, ఐదు ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. 

 

  • మిషన్​ లక్ష్యం దేశంలోని అన్ని సర్క్యూట్లను కలిపేలా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడం.
  • సముద్ర నౌకాశ్రయ, నది, ద్వీప దేశాంతర్గత ప్రాంతాలను మూడు క్రూజ్ విభాగాలుగా వచ్చే ఐదేళ్లల్లో అభివృద్ది చేయడం, సందర్శనకు ఉద్దేశించిన ఓడరేవులు, క్రూజ్​ పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయడం.
  • యూఏఈ, మాల్దీవులు, సింగపూర్​, మలేషియా, థాయిలాండ్​, మయన్మార్​, బంగ్లాదేశ్​, ఇండోనేషియా తదితర పొరుగు దేశాలతో క్రూజ్​ ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.