షారుఖ్ ఖాన్, కాజోల్ జంట పేరెత్తగానే.. దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హే, కబీ ఖుషీ కబీ ఘమ్ లాంటి లవ్ స్టోరీస్ గుర్తొస్తాయి. ఈ సినిమాలు వచ్చి ఏండ్లు కావస్తున్నా ఇప్పటికీ బాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్స్‌లో ఒకరిగా వీళ్ల పేర్లను చెబుతారు. ఇద్దరి మధ్య ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కాజోల్. షారుఖ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, తనతో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్‌లో డాన్స్ చేయాలని ఉందని చెప్పిందామె. అయితే అదే ఇంటర్వ్యూలో ఆమె సరదాగా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
‘ఒకవేళ ఇప్పటికిప్పుడు షారుఖ్ ఎదురైతే మీరు ఏం అడుగుతారు’ అనేది ప్రశ్న. అందుకు బదులిస్తూ.. ‘పఠాన్’ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో చెప్పమని అడుగుతానంటూ సరదాగా రిప్లై ఇచ్చింది కాజోల్. దీంతో ఆ సినిమాకు వచ్చిన వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఫేక్ అనే అర్థం వచ్చేలా కాజోల్ కామెంట్స్ చేసిందంటూ పైర్ అవుతున్నారు షారుఖ్ ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి!