
కాజోల్( Kajol), షారుఖ్(Shah Rukh) జోడీ అందరికి చాలా ఫేమస్ అని విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి కాంబో నుంచి మరో మూవీ వస్తే చూడాలనుకునే ఫ్యాన్స్ చాలానే ఉంటారు. తాజాగా ఇదే విషయం గురుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం డైరెక్టర్ కరణ్ జోహార్ నుంచి రాబోయే చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ నుండి 'తుమ్ క్యా మైలే' పాటలో రణవీర్ సింగ్, అలియా భట్‌లకు బదులుగా షారూఖ్ ఖాన్, కాజోల్ నటిస్తే చూడాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 'తుమ్ క్యా మైలే' సాంగ్ తో అలియా..రణవీర్ మంచు కొండల్లో చేసే డ్యాన్స్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సాంగ్ లో అలియా ధరించిన చీరల గురుంచి టాక్ బాగానే వస్తోంది.
ALSO READ :తమన్నాతో రొమాంటిక్ దశ మొదలైంది..నటుడు విజయ్ వర్మ
ప్రస్తుతం కాజోల్ తొలి OTT షో ది ట్రయల్‌ని ప్రమోట్ చేస్తున్న కాజోల్‌ను ఒక ఇంటర్వ్యూలో ఆమె షిఫాన్ చీరలు ధరించడం.. మంచులో డ్యాన్స్ చేయడం మిస్ అవుతుందా అని అడిగారు. అందుకు కాజోల్ స్పందిస్తూ అలా చేయలేదని..నాకు చలిలో కంటే వెచ్చని వాతావరణంలో వాటిని ధరించడానికి ఇష్టపడతానని తెలిపింది. అయితే 'తుమ్ క్యా మైలే' సాంగ్ లో అలియాకు ఈ చీరలు చాలా అందంగా ఉన్నాయనే అభిప్రాయం తెలిపింది.
ఈ సాంగ్ చూస్తుంటే నాకు మరోసారి షారుఖ్ ఖాన్‌తో ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను పేర్కొన్నారు కాజోల్. త్వరలో షారుక్..కాజోల్ నుంచి సాంగ్ వస్తే చూడటానికి ఫ్యాన్స్ రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది.