అనుపమ్ ఖేర్‌‌ డైరెక్షన్‌లో ‘తన్వి ది గ్రేట్‌’.. హీరోయిన్‌గా పరిచయం అవుతున్న శుభంగి

అనుపమ్ ఖేర్‌‌ డైరెక్షన్‌లో ‘తన్వి ది గ్రేట్‌’.. హీరోయిన్‌గా పరిచయం అవుతున్న శుభంగి

బాలీవుడ్ వెర్సటైట్‌ యాక్టర్‌‌ అనుపమ్ ఖేర్‌‌.. కార్తికేయ 2, టైగర్‌‌ నాగేశ్వరరావు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడాయన దర్శకత్వంలో ‘తన్వి ది గ్రేట్‌’ అనే సినిమా వస్తోంది. ఎన్‌ఎఫ్​డిసితో కలిసి అనుపమ్‌ ఖేర్ స్టూడియోస్‌ బ్యానర్‌‌పై ఆయనే నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు.

ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో శుభంగి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.  తాజాగా తన క్యారెక్టర్‌‌ను పరిచయం చేస్తూ టీజర్‌‌ను విడుదల చేశారు. నటి కాజోల్‌ ఈ టీజర్‌‌ను లాంచ్‌ చేసి బెస్ట్ విషెస్‌ చెప్పారు. ఏదో కోల్పోయినట్టుగా టీజర్‌‌లో శుభంగి పాత్ర కనిపించింది. మే 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని  కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.

ఇక ఈ సినిమా గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల క్రితం ఓ రియల్‌ లైఫ్‌ కన్వర్‌‌జేషన్‌ నుంచి ఈ ఆలోచన పుట్టింది. దాన్ని సినిమాగా చేయడానికి మా టీమ్‌ అందరికీ మూడేళ్లు పట్టింది. తన్వి పాత్రకు తగ్గ నటిని ఎంపిక చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే అమాయకత్వం, ఆకర్షణ, మంచితనం, చిలిపితనం, హాస్యం, స్వచ్ఛత లాంటి చాలా ఎమోషన్స్‌  ఉన్న  పాత్ర అది.

మా ఫిల్మ్ స్కూల్‌ ‘యాక్టర్స్‌ ప్రిపేర్స్‌’లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కళ్లు మూసుకోమని ప్రశాంతంగా ఉండమని చెప్పా. అప్పుడు శుభంగి ముఖంలోని ప్రశాంతత నచ్చి, తనను ఈ పాత్రకు ఎంపిక చేశా’ అని చెప్పారు.