ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాకా కుటుంబంలో పుట్టాను: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాకా కుటుంబంలో పుట్టాను: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

హైదరాబాద్: కాకా వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కాకా కుటుంబంలో పుట్టే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా బడుగుబలహీన వర్గాలకు కాకా చేసిన సేవలను ఆయన గుర్తుచేశారు. బడుగుబలహీన వర్గాల కోసం, పేదవాడి కోసం కాకా పార్లమెంట్లో గర్జించారని పెద్దపల్లి ఎంపీ చెప్పారు.

కాకా స్ఫూర్తితో పేదవాడి కోసం, బడుగుబలహీన వర్గాల కోసం, దళితుల కోసం నిలబడతానని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ  ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాకా 95వ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

ALSO READ | రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి  :  ఎమ్మెల్యే మదన్మోహన్ రావు 

కాకాకు నివాళులర్పించిన ఆయన కుమారుడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాకా వెంకట స్వామి 95వ జయంతి వేడుకలను అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని అన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కాకా చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారని, కాకా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సింగరేణిని కాపాడుకున్నం అంటే కాకా వెంకట్ స్వామి కృషి వల్లేనని వివేక్ చెప్పారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో కాకా క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు.

కాకా సేవలపై వివేక్ వెంకటస్వామి ఇంకా ఏం చెప్పారంటే..

* పేద బీద ప్రజల విద్య కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలను కాకా ఏర్పాటు చేశారు

* 5000 మందికి పైగా విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు

* రాజకీయ నాయకుడి కుమారుడివి అవినీతికి పాల్పడద్దని ఎప్పుడూ మా నాన్న చెప్తుండేవారు

* చట్టానికి లోబడే వ్యాపార లావాదేవీలు చేయాలని చెప్పేవారు

* నాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కం ట్యాక్స్ రైడ్స్ చేయించారు

* ఈడీ, ఐటీ తనిఖీలు చేసినా ఎలాంటి అవినీతి జరగలేదని నిరూపితమైంది

* రాజకీయాల కోసమే ఈడి, ఐటీలను నాపై రుద్దుతున్నారు