కాకా అంబేద్కర్ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవం

కాకా అంబేద్కర్ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవం

ముషీరాబాద్, వెలుగు : బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి.  సోమవారం వారోత్సవాల ముగింపు సందర్భంగా కాలేజీలోని లైబ్రరీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. స్టూడెంట్లు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. కార్యక్రమంలో అంబేద్కర్ విద్యాసంస్థలకు చెందిన ఫ్యాకల్టీ పాల్గొన్నారు.