కాంగ్రెస్ అగ్రనేత ... మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి.. 95 వ జయంతి కార్యక్రమాలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి ఏఎంసీ చౌరస్తాలో కాకా విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్పార్టీ నాయకులు, కాకా అభిమానులు పాల్గొన్నారు. కాకా పెద్దపల్లి ప్రాంత అభివృద్దికి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. కాకా కృషి వల్లే ఈ ప్రాంతం అభివృద్ది చెందిందన్నారు. ఆయన అభివృద్దికి మారు పేరంటూ..ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
ALSO READ | కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీమంత్రి దివంగత నేత... స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పునస్కరించుకుని నివాళులు అర్పించారు. కాకా జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి.. కేక్ కట్ చేసి నిరుపేదలకు అల్పాహార పంపిణీ తో పాటు ఉచిత షుగర్ వ్యాధి పరీక్షలు నిన్వహించారు. కాకా.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా నిరుపేదలకు ఆయన సేవలు ఎంతో ఆదర్శనీయమన్నారు.