సాఫ్ట్​ బాల్ చాంపియన్ కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజ్

సాఫ్ట్​ బాల్ చాంపియన్ కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజ్

ముషీరాబాద్, వెలుగు: ఓయూ పరిధిలోని ఇంటర్ కాలేజీల సాఫ్ట్ బాల్ మెన్ టోర్నమెంట్​లో కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ టీమ్ విజేతగా నిలిచింది. ఉస్మానియా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో  ఓయూలోని ఏ గ్రౌండ్ లో పోటీలు జరిగాయి. వివిధ కాలేజీలకు చెందిన 8 జట్లు పాల్గొనగా.. కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ టీమ్, సర్దార్ పటేల్ కాలేజీ టీమ్ ఫైనల్ కు వెళ్లాయి.

బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్  అంబేద్కర్ కాలేజీ టీమ్ 9-2 తేడాతో చాంపియన్​గా నిలిచింది. ఇంటర్ కాలేజీల సెక్రటరీ కె. కృష్ణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్​కుమార్ విజేత జట్టు మెడల్స్, సర్టిఫికెట్లతో పాటు ఓవరాల్ చాంపియన్ షిప్ ను మంగళవారం ప్రదానం చేశారు. ఫిజికల్ డైరెక్టర్ టి. శ్రావణ్, క్రీడాకారులకు అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ మేనేజ్ మెంట్ అభినందనలు తెలిపింది.