కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ లా కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్​ డే

కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ లా కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్​ డే

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ ​డే సోమవారం ఘనంగా జరిగింది. కోర్సు పూర్తి చేసుకున్న స్టూడెంట్లు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, తెలంగాణ న్యాయ అకాడమీ పూర్వ డైరెక్టర్ రాజేందర్, అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​ డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ, గవర్నమెంట్ కౌన్సిల్ మెంబర్ ప్రియ, పీవీ రమణ కుమార్ పాల్గొని సర్టిఫికెట్లు అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ విద్య సమాజంపై బాధ్యతను పెంచుతుందన్నారు. సమాజాన్ని అద్భుతమైన దారిలో నడిపే బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. పట్టాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులతో ఆనందాన్ని పంచుకున్నారు.