
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో నస్పూర్సూపర్ కింగ్స్ టీం టాపర్ గా నిలిచింది. ఆదివారం నస్పూర్ సూపర్ కింగ్స్, దండేపల్లి లయన్స్టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన దండేపల్లి టీం 14.4 ఓవర్లలో 46 రన్స్‌కే అలౌట్అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నస్పూర్టీం 5.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 రన్స్‌చేసి విక్టరీ సాధించింది.
జట్టుకు చెందిన ఓపెనర్లు నరేందర్‌గౌడ్ 25, ప్రసాద్ 21 రన్స్చేశారు. 4 వికెట్లు తీసిన మహేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎన్నికయ్యాడు. పోటీల నిర్వాహకుడిగా బింగి దుర్గాప్రసాద్వ్యవహరించారు.