
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ క్రికెట్పోటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లలో నస్పూర్, లక్సెట్టిపేట టీమ్స్గెలుపొందాయి. ఉదయం నస్పూర్, మంచిర్యాల రాయల్స్జట్లు తలపడగా, మొదట బ్యాటింగ్చేసిన మంచిర్యాల టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 రన్స్చేసింది. ప్రదీప్ 54 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్, ఎండీ షైప్35 రన్స్ చేశారు. నస్పూర్టీమ్18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేజ్చేసింది.
శ్రీకాంత్ 34 రన్స్‌చేశాడు. మంచిర్యాల రాయల్స్‌కు చెందిన ప్రదీప్‘ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్’ దక్కించుకున్నాడు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో లక్సెట్టిపేట, హాజీపూర్ టైగర్స్తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్చేసిన లక్సెట్టిపేట బ్యాటర్లు 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 రన్స్చేశారు. అనిల్40, మహేశ్30 రన్స్ చేశారు. అనంతరం చేజింగ్‌కు దిగిన హాజీపూర్బ్యాటర్లు16 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 రన్స్మాత్రమే చేశారు. లక్సెట్టిపేట ప్లేయర్రమేశ్‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.