రామగుండం నియోజకవర్గ స్థాయి .. కాకా క్రికెట్​ టోర్నీ ప్రారంభం

రామగుండం నియోజకవర్గ స్థాయి  .. కాకా క్రికెట్​ టోర్నీ ప్రారంభం

గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్​కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్​టోర్నీ సోమవారం ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్ పాలకుర్తి, ఎన్టీపీసీ టీం మధ్య జరుగగా పాలకుర్తి టీం గెలిచింది. మొత్తం 15 ఓవర్లలో ఎన్టీపీసీ జట్టు 10 వికెట్లు నష్టపోయి 95 రన్స్​చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన పాలకుర్తి టీం 14.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 98 రన్స్ చేసి విజయం సాధించింది. ఈ జట్టులో సాయి రోహిత్​40 బాల్స్ లో 53 రన్స్​చేసి నాటౌట్ గా నిలిచాడు.

మధ్యాహ్నం రామగుండం, అంతర్గాం జట్ల మధ్య మ్యాచ్ జరుగగా రామగుండం జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్​ప్రారంభించిన అంతర్గాం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్​చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రామగుండం జట్టు 18 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి 134 రన్స్​చేసింది. ఈ టీంలో అరుణ్​53 బాల్స్ లో 68 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కార్యక్రమంలో శశి, మబ్బు శంకర్, ప్రవీణ్, కాళీ, మధు, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.