అంబేద్కర్ కాలేజీలో కాకా వెంకటస్వామి 10 వ వర్థంతి వేడుకలు జరిగాయి. కాకా స్ఫూర్తితోనే తెలంగాణ కోసం కోట్లాడామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నామన్నారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈ విద్యాసంస్థలను నెలకొల్పామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సు ప్రవేశపెడతామన్నారు.
తాను ఎక్కడికి వెళ్లినా.. కాకా కుమారుడిగా ఎనలేని గౌరవాన్ని పొందుతానన్నారు. అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. పట్టుదలతో... క్రమశిక్షణతో ఇక్కడ విద్యనందిస్తున్నామన్నారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ కాలేజీని స్థాపించామన్నారు. ఈ కాలేజీ విద్యార్థులకు ఫీ రిఎంబర్స్ మెంట్ కూడా వర్తిస్తుందన్నారు. త్వరలో అంబేద్కర్ కాలేజీ అటానమస్ కాలేజీ కాబోతుందన్నారు.
అంబేద్కర్ కళాశాల కి న్యాక్ గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కాలేజీలో లా కోర్సు చదివిన వారు జడ్జీలు కూడా అయ్యారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కాలేజీలో డొనేషన్ ఉండదన్నారు. మంచి విద్య ఉన్నపుడే సమాజం లో గుర్తిపు ఉంటుందన్నారు.