విద్యార్థి దశ నుంచే సమాజాన్ని చదవాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

విద్యార్థి దశ నుంచే సమాజాన్ని చదవాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • స్టూడెంట్లకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచన
  • సందడిగా కాకా డాక్టర్ ​బీఆర్ అంబేద్కర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్​

ముషీరాబాద్, వెలుగు : నిరంతర శ్రమ, పట్టుదలతోనే గొప్ప విజయాలు సాధ్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. విద్యార్థి దశ నుంచే సమాజాన్ని చదువుతూ స్థిరమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచించారు. శనివారం బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్​ బీఆర్​అంబేద్కర్​స్కూల్​యాన్యువల్ డే సందడిగా జరిగింది. ముఖ్య అతిథులుగా గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కరస్పాండెంట్ సరోజా వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఎక్కువగా చదువుకుంటుంది పేద, మధ్య తరగతి విద్యార్థులేనని, స్టేట్​లెవల్​ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. 

కాకా వెంకటస్వామి ఎంతో దూర దృష్టితో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసం అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారని తెలిపారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. సరోజా వివేక్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా రాణించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ విఠలాచారి, రాధా రాణి, అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్, చేతివృత్తుల స్టాల్స్​ఆకట్టుకున్నాయి. ప్లాస్టిక్​ను నివారిద్దామని పిలుపునిస్తూ ఓ స్టూడెంట్​ప్లాస్టిక్​కవర్లతో హాజరై అందరినీ ఆలోచింపజేశాడు. పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.