కాకా పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారు : వినోద్ కుమార్

కాకా పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే, వినోద్ కుమార్ అన్నారు. అంబేద్కర్ కాలేజీ ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడుస్తుందని అప్పటినుంచి ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రతి స్టూడెంట్ చక్కగా చదువుకోవాలని సూచించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ లో లా కాలేజీ 2024 ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. 

ALSO READ :- సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా

అకాడమిక్ డైరెక్టర్ రిషికాంత్ మాట్లాడుతూ సీనియర్లు జూనియర్లకు చదువు విషయంలో సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలని సూచించారు. అంబేద్కర్ కాలేజీ ఎంతో గొప్పదని అని  సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. అంబేడ్కర్ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉందని అంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్  సృజన, అకాడమిక్ డైరెక్టర్ రిషికాంత్, జాయింట్ సెక్రెటరీ పీవీ రమణకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.