గోపాల్‎రావు పేటతో కాకా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం: ఎమ్మెల్యే వివేక్

గోపాల్‎రావు పేటతో కాకా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం: ఎమ్మెల్యే వివేక్

పెద్దపల్లి: గోపాల్‎రావు పేటతో కాకా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం గోపాల్‎రావు పేట్‎లోని శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, దొంగతూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వివేక్‎కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ఆలయ అభివృద్ధికి సహకరించినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకట్వేర స్వామి కళ్యాణ మహత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపాల్‎రావు పేటతో కాకా ఫ్యామిలీకి ప్రత్యేక బంధముందన్నారు. 

నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు బ్రిడ్జి కావాలనే కోరితే  జీవన్ రెడ్డితో మాట్లాడి వెంటనే మంజూరు చేయించామని గుర్తు చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు విశాఖ ట్రస్ట్ నుండి పాఠశాలల విద్యార్థులకు బెంచీలు అందించామని తెలిపారు. కాకా కుటుంబ పట్ల గోపాల్‎రావు పేట గ్రామస్తులు చూపే ప్రేమ మరువలేనిదని అన్నారు. గోపాల్ రావు పేట వేంకటేశ్వర ఆలయాన్ని మీ ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్నారు.