కోల్‌బెల్ట్, వెలుగు : కాకా వెంకటస్వామి స్మారక బెల్లంపల్లి నియోజకవర్గస్థాయి క్రికెట్‌పోటీల్లో బెల్లంపల్లి జట్టు 10 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో ఆదివారం బెల్లంపల్లి, కాసీపేట టీమ్ ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ఎంచుకున్న కాసీపేట జట్టు 16 ఓవర్లలో 115 రన్స్ చేసి ఆలౌట్అయ్యింది. బౌలర్కుమార్4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్చేసిన బెల్లంపల్లి జట్టు ఒకే ఒక్క వికెట్కోల్పోయి 13 ఓవర్లలోనే టార్గెట్ఛేజ్చేసింది.
ఈ గెలుపుతో బెల్లంపల్లి టీమ్ నియోజకవర్గస్థాయి టాపర్‌గా నిలిచింది. జట్టుకు చెందిన సాయి 43 బాల్స్‌లో 83 రన్స్‌తో నాటౌట్ గా నిలిచి ప్లేయర్ఆఫ్ది మ్యాచ్ దక్కించుకున్నాడు. ఈ నెల 4 నుంచి జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటీ ఆర్గనైజర్‌గా మత్తమారి శశికాంత్ వ్యవహరించగా అంపైర్లుగా తండూరి శ్రీనివాస్, గజ్జె దుర్గయ్య పనిచేశారు.
చెన్నూరు టైగర్స్ విక్టరీ
రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్స్టేడియంలో ఆదివారం కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గస్థాయి క్రికెట్‌పోటీల్లో చెన్నూరు టైగర్స్, జైపూర్ జాగూర్స్ టీమ్ లు తలపడ్డాయి. చెన్నూరు టైగర్స్జట్టుకు చెందిన మిర్జా అదీబ్అహ్మద్ 81 బాల్స్ లో 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 92 పరుగులు చేయగా, బొడ్డు సురేందర్37 బాల్స్ లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 64 రన్ చేయడంతో పాటు సాయిచంద్ 27 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 202 స్కోర్చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జైపూర్ జాగూర్స్ టీం 19 ఓవర్లలో 88 రన్స్‌చేసి అలౌట్ అయ్యింది.
దీంతో చెన్నూరు టైగర్స్ జట్టు 114 రన్స్తేడా విక్టరీ సాధించింది. 92 రన్స్చేసిన మిర్జా ఆదీబ్అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. మందమర్రి టైగర్స్, భీమారం జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ లో భీమారం జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 రన్స్చేసింది. కల్యాణ్పటేల్ 22, వీరేందర్24 రన్స్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మందమర్రి టైగర్స్ జట్టు 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్చేసింది. 37 రన్స్‌తో పాటు 5 వికెట్లు తీసిన వేణు ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. పోటీల నిర్వాహకుడిగా సీనియర్క్రికెటర్ నీలం రాకేశ్‌గౌడ్, అంపైర్లుగాకిశోర్ సంతోశ్వ్యవహరించారు.