
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో గురువారం కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్ గోదావరిఖని, రామగుండం టీమ్స్ మధ్య జరుగగా గోదావరిఖని జట్టు విజయం సాధించింది.
గోదావరిఖని జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 142 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన రామగుండం 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసి ఓటమిపాలైంది. గోదావరిఖని జట్టులో ఎండి. గున్షావలీ 28 బాల్స్లో 33 రన్స్, మొగిలి నరేందర్ 25 బాల్స్ లో 33 రన్స్, రామగుండం జట్టులో కిశోర్ పటేల్32 బాల్స్ లో 38 రన్స్ చేశారు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్లో అంతర్గాం, ఎన్టీపీసీ జట్లు తలపడగా ఎన్టీపీసీ టీం గెలుపొందింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన అంతర్గాం జట్టు 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేయగా, తర్వాత బ్యాటింగ్కు దిగిన ఎన్టీపీసీ 12 ఓవర్స్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. అంతర్గాం జట్టులో రవి 37 బాల్స్లో 40, ఎన్టీపీసీ జట్టులో సూరి 26 బాల్స్లో 28, కిట్టూ 12 బాల్స్లో 20 రన్స్ చేశారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.