- తొలిరోజు మంచిర్యాల, చెన్నూరు జట్ల విక్టరీ
- సెంచరీ చేసిన మంచిర్యాల ప్లేయర్సాయిరెడ్డి
కోల్‌బెల్ట్,వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్స్టేడియంలో మంగళవారం కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మంచిర్యాల, చెన్నూరు జట్లు ఘన విజయాలు సాధించాయి. తొలిమ్యాచ్మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల జట్ల మధ్య జరిగింది. 20 ఓవర్లలో మంచిర్యాల మూడు వికెట్లు కోల్పోయి190 రన్స్చేసింది.
సాయిరెడ్డి 67 బాల్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103 రన్స్‌చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రదీన్ఏడు ఫోర్లతో 26 బాల్స్‌లో 41 రన్స్, కాజీమ్28 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెల్లంపల్లి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 రన్స్ మాత్రమే చేయగలిగారు. కుమార్ 31, సాయికృష్ణ 29 రన్స్ చేశారు. మంచిర్యాల ప్లేయర్సాయిరెడ్డి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్అవార్డు దక్కించుకున్నాడు. పోటీల ప్రారంభోత్సవంలో క్యాతనపల్లి మున్సిపల్వైస్చైర్మన్సాగర్రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పి.రాఘునాథ్‌రెడ్డి, పల్లె రాజు, గోపతి రాజయ్య, ఒడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, పుల్లూరి కళ్యాణ్,బింగి శివకిరణ్, పోటీల నిర్వాహకుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
రెండో మ్యాచ్‌లో చెన్నూరు విక్టరీ
రామకృష్ణాపూర్సింగరేణి ఠాగూర్స్టేడియంలో మధ్యాహ్నం చెన్నూరు, పెద్దపల్లి నియోజకవర్గ జట్ల మధ్య మ్యాచ్జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 రన్స్చేసింది. భార్గవ్ 33 బాల్స్‌లో 9 ఫోర్లతో 45 రన్స్, జి.రమేశ్‌యాదవ్29 బాల్స్‌లో 4 ఫోర్లతో 43 రన్స్చేశారు. తర్వాత బ్యాటింగ్చేసిన పెద్దపల్లి జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 140 రన్స్చేసింది. రాకేశ్ 24 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 రన్స్ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్‌చేసి ఏడు పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టిన చెన్నూరు ఆటగాడు ఇదునూరి గణేశ్‌కు ప్లేయర్ఆఫ్ది మ్యాచ్ దక్కగా క్యాతనపల్లి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, మాజీ జడ్పీటీసీ యాకుబ్‌అలీ అందజేశారు.