మేడారంలో కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

  •     తొలి మ్యాచ్ లో వెల్గటూర్ జట్టుపై ధర్మారం గెలుపు

ధర్మారం,వెలుగు: కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గస్థాయి పోటీలు ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఆదివారం ప్రారంభమయ్యాయి.  

కాకా ఫౌండేషన్ ద్వారా ఆటగాళ్లకు టీ షర్ట్స్, క్రికెట్ కిట్స్ అందించారు.  తొలి మ్యాచ్ ధర్మారం, వెల్గటూర్ జట్ల మధ్య జరగ్గా ధర్మారం జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట ధర్మారం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.  ఓపెనర్ తిరుపతి 89 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెల్గటూర్ జట్టు 7  వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేయగలిగింది.